రక్తసంబంధాలు(Relationship)బేసిక్ కాన్సెప్ట్

రక్తసంబంధాలను, బంధుత్వ సంబంధాలను తెలియజేయును రక్తసంబంధాలను మనం గమనిస్తూ ఈ అధ్యాయంలో ప్రశ్నలకి సమాధానం చేయాలి. వీలైనంత ప్రాక్టీస్ ద్వారా వీటిని సులువుగా చేయవచ్చు దానికి ముందుగా మనం సంబంధాలను గూర్చి విపులంగా తెలుసుకోవాలి
 మనకు తరచు వినిపించే కొన్ని సంబంధాలను గురించి మేము క్రింద చర్చించాము గమనించండి.

తండ్రి (నాన్న)అమ్మ-------------------------------------------------------------- నానమ్మ


తండ్రి (నాన్న)నాన్న------------------------------------------------------------- జేజినాన్న /తాతయ్య


తండ్రి (నాన్న)చెల్లెలు/అక్క------------------------------------------------------ అత్తయ్య


తండ్రి (నాన్న)/తల్లి (అమ్మ) కుమారుడు---------------------------------------- తమ్ముడు/అన్న


తండ్రి (నాన్న)ఏకైక కుమారుడు (for men) ----------------------------------- నువ్వే


తండ్రి (నాన్న)ఏకైక కూతురు  (for women) ----------------------------------- నువ్వే


తండ్రి (నాన్న)/తల్లి (అమ్మ) కూతురు------------------------------------------- చెల్లెలు/అక్క


తండ్రి (నాన్న)తమ్ముడు--------------------------------------------------------- చిన్నాన్న


తండ్రి (నాన్న)అన్న-------------------------------------------------------------- పెద్దనాన్న


తండ్రి (నాన్న)బావమరిది /బావ ------------------------------------------------ మామయ్య


తల్లి (అమ్మ)చెల్లెలు/అక్క-------------------------------------------------------- పిన్నమ్మ /చిన్నమ్మ


తల్లి (అమ్మ)తమ్ముడు/అన్న--------------------------------------------------- మామయ్య


తల్లి (అమ్మ)అమ్మ-------------------------------------------------------------- అమ్మమ్మ




రక్త సంబంధాల ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు ఎప్పుడూ కుటుంబ వృక్షం (Family Tree) గీయడం అలవాటు చేసుకోండి.

పురుషులకు ఒక గుర్తు (ఉదాహరణకు + లేదా చతురస్రం), స్త్రీలకు ఒక గుర్తు (ఉదాహరణకు - లేదా వృత్తం) వాడితే గందరగోళం ఉండదు.

రీజనింగ్‌లో కుటుంబ వృక్షం గీసేటప్పుడు మనం కొన్ని ప్రామాణిక గుర్తులను వాడుతాము:

పురుషుడు: [ ] (చతురస్రం) లేదా + గుర్తు.

స్త్రీ: ( ) (వృత్తం) లేదా - గుర్తు.

దంపతులు (భార్యాభర్తలు): <==> (రెండు గీతలు).

సోదర సోదరీమణులు: ---- (ఒక అడ్డ గీత).

తరాల వ్యత్యాసం (తండ్రి/కొడుకు): | (నిలువు గీత).

కుటుంబ వృక్షం ఉదాహరణ (Example Case):

సమాచారం:

"ఒక కుటుంబంలో రాము, సీత దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు - ఒక కొడుకు (అజయ్), ఒక కూతురు (అక్షర). అజయ్ భార్య పేరు కవిత. వారికి ఒక బాబు (చింటు) ఉన్నాడు."

దీన్ని వృక్షంలా గీస్తే:

మొదటి తరం (Grandparents/Parents):

రాము [+] <==> సీత [-] (వీరు దంపతులు)
వీరి కింద నిలువు గీత | గీసి పిల్లలను చూపాలి.

రెండవ తరం (Children):

అజయ్ [+] ---- అక్షర [-] (వీరు అన్నచెల్లెళ్లు)

అజయ్ [+] <==> కవిత [-] (అజయ్ భార్య కవిత)

మూడవ తరం (Grandchildren):

అజయ్ మరియు కవితల కింద నిలువు గీత | గీసి వారి బాబును చూపాలి.
చింటు [+]