160 మీ పొడవు గల ఒక రైలు 700మీ పొడవుగల ప్లాట్‌ఫాం ను దాటుటకు 20 సెకనులు పట్టిన రైలు వేగం ఎంత?
రైలు ప్రయాణించిన దూరం = రైలుపొడవు + ప్లాట్‌ఫాం పొడవు
రైలు ప్రయాణించిన దూరం = 160+ 700 = 860 మీ.
వేగం = దూరం / కాలం
వేగం = 860/20 = 43
వేగం = 43 మీ / సె.
50 km /hr వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం మీటర్/గంట లలో
ఎంత ?
1 కిలో మీటర్ = 1000 మీటర్లు
50 కిలో మీటర్ = 50 * 1000 మీటర్లు
20 మీ / సె వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం కిలోమీటర్/గంట లలో ఎంత ?
1000 మీటర్లు = 1 కిలో మీటర్
1 మీటర్లు = 1 / 1000 కిలో మీటర్
3600 సెకన్లు = 1 గంట
1 సెకన్లు = 1 / 3600 గంట
1 మీ / సె = ( 1 / 1000 ) / ( 1 / 3600 ) కిలో మీటర్/గంట
1 మీ / సె = 3600 / 1000 కిలోమీటర్/గంట
1 మీ / సె = 18 / 5 కిలో మీటర్/గంట
20 * 18 / 5 = 72 కిలో మీటర్/గంట
108 కిలోమీటర్ / గంట వేగంతో ప్రయాణిస్తున్న రైలు వేగం
మీ / సె లలో ఎంత ?
కిలో మీటర్ కి = 1000 మీటర్లు
1 గంట కి = 60 * 60 = 3600 సెకన్లు
కిలో మీటర్/గంట = 1000 / 3600
1km/hr = 5 / 18 మీ / సె
108 * 5 / 18 = 6 * 5 = 30 మీ / సె
సమాన పొడవు గల రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఒక దానిని మరొకటి దాటుటకు 1 నిమిషం సమయం పట్టిన రైలు పొడవును కనుగొనుము?
రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి కావున
రైలు సాపేక్ష వేగం = మొదటి రైలు వేగం + రెండవ రైలు వేగం
రైలు సాపేక్ష వేగం = 30 + 60 = 90 km/hr
కాలం = 1 నిమిషం = 1 / 60 hrs
ఇక్కడ కాలం నిమిషాలలో ఉంది. కావున గంటలలో మార్చాలి గంటకి 60 నిమిషాలు కావున నిమిషాలను గంటలలో కి మార్చాలి అంటే 60 తో భాగించాలి.
30 + 60 = 90 km/hr
కాలం = 1 / 60
దూరం = వేగం * కాలం
దూరం = 90 * 1 / 60
దూరం = 1.5 km
రైలు ప్రయాణించిన దూరం = రెండు రైళ్ళ పొడవు = 1.5 km
ఒక రైలు పొడవు = 1.5 / 2 = 0.75 km
రైలు పొడవు 0.75 కిలో మీటర్లు,
కిలో మీటర్లను మీటర్ల లోకి మార్చాలి అంటే1000 తో గుణించాలి
0.75 X 1000 = 750
రైలు పొడవు = 750 మీటర్లు
ఒక రైలు ఆగుతూ ఆగుతూ గంటకు 65 km/hr వేగంతో మరొక సందర్భంలో ఆగకుండా 85 Km / hr తోను ప్రయాణించి గమ్యం చేరిన రైలు ఎంతకాలం ఆగుతుంది ?
దూరంలో భేదం = 85 - 65 = 20 kms
వేగం = 85 km/ hr
కాలంలో భేదం = దూరంలో భేదం / వేగం = 20 / 85
= 20 / 85 hrs =( 20 / 85 ) * 60 = 240 / 17 = 14.11 నిమిషాలు
15 m/s వేగంతో వెళ్లే రైలు 2 నిమిషాల్లో ప్రయాణించే దూరం (km లో)?
108 km/hr ని m/s లోకి మార్చండి.
72 km/hr వేగంతో వెళ్లే రైలు 500 మీటర్ల దూరాన్ని ఎంత సమయంలో దాటుతుంది?
ఒక రైలు 150 కిలోమీటర్లను 3 గంటల్లో ప్రయాణిస్తే దాని వేగం m/s లో ఎంత?
20 m/s వేగాన్ని km/hr లోకి మార్చండి.
ఒక రైలు నిమిషానికి 1.2 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాని వేగం km/hr లో ఎంత?
45 km/hr వేగంతో 400 మీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత?
విభాగం 2: రైలు ఒక స్తంభాన్ని లేదా వ్యక్తిని దాటడం
(సూత్రం: దూరం = రైలు పొడవు)
200 మీటర్ల పొడవున్న రైలు 72 km/hr వేగంతో ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది?
60 km/hr వేగంతో వెళ్లే రైలు ఒక వ్యక్తిని 9 సెకన్లలో దాటితే, రైలు పొడవు ఎంత?
150 మీటర్ల పొడవున్న రైలు ఒక స్తంభాన్ని 6 సెకన్లలో దాటితే దాని వేగం (km/hr)?
300 మీటర్ల పొడవున్న రైలు 90 km/hr వేగంతో ఒక సిగ్నల్ పోస్ట్‌ను
ఎంత సమయంలో దాటుతుంది?
ఒక రైలు ఒక వ్యక్తిని 12 సెకన్లలో దాటింది. రైలు వేగం 54 km/hr
అయితే రైలు పొడవు ఎంత?
54 km/hr ని m/s లోకి మార్చండి.
25 m/s ని km/hr లోకి మార్చండి.
90 km/hr వేగంతో ఒక రైలు 10 సెకన్లలో ఎంత దూరం ప్రయాణిస్తుం
ది?
.