పాచికలు(Dice) పై ప్రాథమిక సూత్రాలు



పాచికల (Dice)


పాచికలకు సంబంధించి రెండు ముఖ్యమైన నియమాలు ఉన్నాయి:


ప్రామాణిక పాచిక (Standard Die):


ఎదురెదురు ముఖాల మొత్తం ఎప్పుడూ 7 ఉంటుంది (1+6, 2+5, 3+4).


సాధారణ పాచిక (Ordinary Die) :


  పక్కపక్క ముఖాల మొత్తం 7 అవ్వచ్చు. దీనిలో ఎదురెదురు సంఖ్యలు స్థిరంగా ఉండవు.



విభాగం 1: ఒకే పాచికను దొర్లించినప్పుడు 


సమస్య 1: ఒక పాచికను దొర్లించినప్పుడు '4' రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: మొత్తం ఫలితాలు = 6 {1, 2, 3, 4, 5, 6}. అనుకూల ఫలితం = 1 {4}.


సమాధానం: 1/6.


సమస్య 2: సరి సంఖ్య (Even number) రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = సరి సంఖ్య (Even number) = 3 {2, 4, 6}.


సమాధానం: 3/6 = 1/2.


సమస్య 3: బేసి సంఖ్య (Odd number) రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = 3 {1, 3, 5}.


సమాధానం: 1/2.


సమస్య 4: ప్రధాన సంఖ్య (Prime number) రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = 3 {2, 3, 5}. (గమనిక: 1 ప్రధాన సంఖ్య కాదు).


సమాధానం: 1/2.


సమస్య 5: 3 కంటే ఎక్కువ సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = 3 {4, 5, 6}.


సమాధానం: 1/2.


విభాగం 2: రెండు పాచికలు దొర్లించినప్పుడు 


రెండు పాచికలు వేసినప్పుడు మొత్తం ఫలితాలు = 6 * 6 = 36.


సమస్య 1: రెండు పాచికల పై సంఖ్యల మొత్తం 7 కావడానికి సంభావ్యత ఎంత?


సాధన: పైన పట్టిక ప్రకారం 6 జంటలు ఉన్నాయి.


(3+4),(4+3),(2+5),(5+2),(1+6),(6+1)


సమాధానం: 6/36 = 1/6.


సమస్య 2: రెండు పాచికలపై ఒకే సంఖ్య (Doublets) రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = 6 {(1,1), (2,2), (3,3), (4,4), (5,5), (6,6)}.


సమాధానం: 6/36 = 1/6.


సమస్య 3: మొత్తం 10 కంటే ఎక్కువ రావడానికి సంభావ్యత ఎంత?


సాధన: అనుకూల ఫలితాలు = 3 {(5,6), (6,5), (6,6)}.

సమాధానం: 3/36 = 1/12.


నియమం 1: రెండు వేర్వేరు చిత్రాల్లో ఒకే సంఖ్య ఉండి, అది ఒకే స్థానంలో ఉంటే, మిగిలిన ముఖాలు ఎదురెదురుగా ఉంటాయి.

సమస్య ex : ఒక పాచిక రెండు స్థితిల్లో (2, 3, 1) మరియు (2, 5, 6) ఉన్నాయి. 3 కి ఎదురుగా ఉన్నది ఏది?

సాధన: 2 రెండింటిలోనూ సమానంగా ఉంది. క్లాక్‌వైజ్ (Clockwise) పద్ధతిలో రాస్తే:

పాచిక 1: 2 -> 3 -> 1

పాచిక 2: 2 -> 5 -> 6

సమాధానం: 3 కి ఎదురుగా 5 ఉంది. 1 కి ఎదురుగా 6 ఉంది. 2 కి ఎదురుగా మిగిలిన 4 ఉంటుంది.

విభాగం 3: లాజికల్ రీజనింగ్ - ఎదురెదురు ముఖాలు కనుగొనడం

సమస్య : రెండు ముఖాలు సమానంగా ఉంటే (ఉదా: 2, 4, 1 మరియు 2, 4, 5), మిగిలిన మూడవ ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి.

సమాధానం: ఇక్కడ 1 కి ఎదురుగా 5 ఉంటుంది.

విభాగం 4: ఓపెన్ డైస్ (Open Dice)

​ఒక పాచికను విప్పినప్పుడు (Unfolded), ఒక గడి వదిలి మరొక గడి ఎదురెదురుగా ఉంటాయి.

ఒక పాచికను విప్పినప్పుడు 6 ముఖాలు వేర్వేరు ఆకారాల్లో కనిపిస్తాయి. దీనిలో ఎదురెదురు ముఖాలను గుర్తించడానికి "ప్రత్యామ్నాయ గడి" (Alternate Box) సూత్రాన్ని వాడాలి.


ముఖ్యమైన పాయింట్లు:


ఒక సరళ రేఖలో ఉన్న గడులలో, ఒకటి విడిచి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి.

పక్కపక్కన అంచులు లేదా మూలలు తాకుతున్న గడులు ఎప్పటికీ ఎదురెదురు ముఖాలు కావు.

సమస్య : ఒక నిలువు వరుసలో 1, 2, 3, 4 సంఖ్యలు ఉంటే:

సాధన: 1 కి ఎదురుగా 3 ఉంటుంది. 2 కి ఎదురుగా 4 ఉంటుంది.

సమస్య :విప్పిన పాచికలో ఒక గడి వదిలి మరొక గడి ఏమవుతుంది?

జవాబు: ఎదురెదురు ముఖం


విభాగం 5: మూడు పాచికలు 


చిట్కా: ఏవైనా రెండు పాచికలను ఎంచుకోండి. వాటిలో ఒకే ఒక సంఖ్య కామన్‌గా ఉండేలా చూసుకోండి. అప్పుడు క్లాక్‌వైజ్ రూల్ వాడటం సులభం అవుతుంది.



మూడు పాచికలు దొర్లించినప్పుడు మొత్తం ఫలితాలు? (జవాబు: 6*6*6 = 216)


మూడు పాచికలపై మొత్తం 3 రావడానికి అవకాశం? (జవాబు: 1/216)


మూడు పాచికలపై మొత్తం 18 రావడానికి అవకాశం? (జవాబు: 1/216)


టూ కామన్ రూల్ (Two Common Rule)

రెండు పాచికల చిత్రాలలో రెండు సంఖ్యలు సమానంగా ఉన్నప్పుడు ఈ నియమాన్ని ఉపయోగిస్తాం.


నియమం: రెండు చిత్రాలలో ఏవైనా రెండు సంఖ్యలు సమానంగా ఉంటే, మిగిలిన మూడవ సంఖ్యలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి.


ఉదాహరణ:


పాచిక 1: (2, 3, 5)


పాచిక 2: (2, 3, 6)


ఇక్కడ 2 మరియు 3 సమానంగా ఉన్నాయి. కాబట్టి, 5 కి ఎదురుగా 6 ఉంటుంది.


 రంగులు మరియు చిహ్నాలపై ప్రశ్నలు (Colors and Symbols)


పరీక్షల్లో అంకెలకు బదులుగా రంగులు (ఎరుపు, నీలం...) లేదా చిహ్నాలు (@, #, $...) ఇస్తుంటారు. వీటిని కూడా క్లాక్‌వైజ్ రూల్ ఉపయోగించే సాధించవచ్చు.


ప్రశ్న:


స్థితి 1: (ఎరుపు, పసుపు, నీలం)


స్థితి 2: (ఎరుపు, తెలుపు, నలుపు)


సాధన: 'ఎరుపు' నుండి క్లాక్‌వైజ్ రాస్తే:


ఎరుపు → పసుపు → నీలం


ఎరుపు → తెలుపు → నలుపు


జవాబు: పసుపు ↔ తెలుపు, నీలం ↔ నలుపు.



గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూత్రాలు (Quick Tips):


ఎదురెదురు ముఖాలు ఎప్పుడూ పక్కపక్కన కనిపించవు. (ఇది ఆప్షన్లను ఎలిమినేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది).


రెండు ముఖాలు సమానంగా ఉంటే, మిగిలిన మూడవ ముఖాలే ఒకదానికొకటి ఆపోజిట్.


కేవలం ఒక ముఖం మాత్రమే సమానంగా ఉంటే, 'క్లాక్‌వైజ్ రూల్' ఉత్తమమైనది.