శాతం%(hard)


ఒక తరగతి లో 500 మంది విద్యార్థులు వున్నా అందులో 300 మంది బాలికలు,   200 మంది

బాలురు ఆ తరగతి 60% ఉత్తీర్ణత సాధించిన అందులో 200  మంది బాలికలు  అయిన

ఉత్తీర్ణులైన బాలురు ఎందరు.?



ఉత్తీర్ణత శాతం = 60%

 శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100


    ఇచ్చిన విలువ ను x అనుకొనిన
 
   60%=(x /500) × 100
             
              x=(60 ×500) /100

               x=300

ఇక్కడ x=ఉత్తీర్ణులైన విద్యార్థులు =300

ఉత్తీర్ణులైన బాలికలు =200

ఉత్తీర్ణులైన బాలురు =300-200=100

 జవాబు =100

ఒక కారు20 కిలోమీటర్ల దూరాన్ని50km/hr వేగంతో పూర్తి చేయటం పట్టిన కాలం గంటలో 

ఎంత శాతం?


 కాలం = దూరం/వేగం


20/50


 కాలం=2/5 గంటలు


 కాలాన్ని గంటల నుంచి చి నిమిషాల్లో కి మార్చాలి


 కాలం=⅖*60 = 24 నిమిషాలు


ఒక గంటకు 60 నిమిషాలు  అవున 60 నిమిషాలలో24 నిమిషాల శాతాన్ని  కనుక్కోవాలి


 శాతం=24/60 *100=40శాతం


   కాలం  శాతం=40%


 జవాబు=40%


ఒక గ్రామంలో 500 మంది జనాభాలో150 మంది మార్గ గ్రామం కు వలస వెళ్ళేది అయినా

గ్రామంలో  5 శాతం జనాభా పెరిగిన ఎంత మంది శిశువులు జన్మించారు?

( మరణాలు 0 అనుకొనిన)


500  లలో లో5%


5%=x/500 * 100


=25

 

జన్మించిన శిశువు లు = 25+150 వలస వెళ్ళినవారు


మొత్తం జన్మించిన శిశువు లు=175


 జవాబు=175  శిశువు లు


ఒక వ్యక్తి నెలసరి ఆదాయం20% తగ్గించబడింది అయిన తిరిగి పూర్వ ఆదాయం రావడానికి

ఎంత శాతం పెంచవలెను?


ఆదాయం=100 రూపాయలు అనుకోనిన


 20 శాతం తగ్గించబడి న తర్వాత  ఆదాయం=100-20=80 రూపాయలు


 తగిన ఆదాయం పూర్వ స్థితికి రావడానికి కలపవలసిన శాతం


 శాతం=20/80*100


 శాతం=25%


 జవాబు=25%


ఒక వ్యక్తి  జీతం 25000 అయినా అతని జీతం25% పెంచబడింది జీవితంలో ఎంత శాతం

తగ్గితే మొదటి జీతం  విలువ వస్తుంది?


 పెంచబడిన విలువ=x అనుకొనిన


25=x/25000 *100


x=25*250=6250


25 శాతం పెంచిన తర్వాత జీతం=25000+6250=31250


  గత జీతం  విలువ రావాలంటే  తగ్గించ  వలసిన శాతం=


 శాతం=6250/31250*100=20%


 జవాబు=20%

 ఒక గృహిణి 200 రూపాయలు చక్కెర కోసం ఖర్చు చేస్తుంది అయితే ఖరీదు10% తగ్గడం

వల్ల రెండు కేజీల చక్కెర ఎక్కువ లభించును అయినా మొదట చక్కెర ఖరీదు, ఎంత?


మొదట చక్కెర =x  కేజీలు అనుకొనిన


200-- x కేజీలు---100%---------Eq -----1


 

200-- x+2---------90%---------Eq ---  2



From Eq -----1


200=100x



From Eq ---  2


200=90(x+2)


200=90X+2x



From 1,2

90X+2x=100x


10x=180


x=180/10


x=18 కేజీలు 


200=18


200/18=11.11


మొదట  ఖరీదు= 11.11 రూపాయలు


10%తగ్గిన తర్వాత  ఖరీదు=10 రూపాయలు


 జవాబు= 11.11 రూపాయలు, 10  రూపాయలు


ఒక  సంఖ్యకు 40% విలువ 200 ఐతే ఆ సంఖ్య యొక్క150% విలువ ఎంత?


సంఖ్యను x అనుకొనిన 


శాతం= విలువ/  మొత్తం విలువ*100


40%=(200/x)*100


x=200*100/40


ఆ సంఖ్య  x=500


 ఆ సంఖ్య యొక్క 150 శాతం విలువ N 


150=N/500*100


N=(150* 500)/100


N= 750


  ఆ సంఖ్య యొక్క 150 శాతం విలువ N = 750


 జవాబు=750


Short cut method


40%=200


150%=N


N=?


N=(200/40)*150


N=150*5


N=750


జవాబు=750


ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసిన ఒక పంచాయతీ ఎన్నికలలో ఒక అభ్యర్థి 76% ఓట్లు

పొందగా అతడు 650 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన, మొత్తం పోలైన ఓట్లు ఎన్ని,

ఓడిపోయిన అభ్యర్థికి చెందిన ఓట్లు ఎన్ని, గెలుపొందిన అభ్యర్థి  ఓట్లు ఎన్ని?


 ఓడిన అభ్యర్ది ఓట్లు శాతం=100 - గెలుపొందిన అభ్యర్థి  ఓట్ల శాతం=100-76=24%


మెజారిటీ ఓట్ల శాతం= గెలుపొందిన అభ్యర్థి ఓట్ల శాతం - ఓడిన అభ్యర్థి  ఓట్ల శాతం


మెజారిటీ ఓట్ల శాతం=76-24=52 % = 650 ఓట్లు


పోలైన ఓట్లు = X అనుకున్న



52%= 650/x*100 =1250



 మొత్తం ఓట్లు=1250


 ఓడిన అభ్యర్ది ఓట్లు= z అనుకొని న


24% =( Z/1250)* 100


Z = (24*1250)/100


Z = 300

గెలుపొందిన అభ్యర్ది ఓట్లు = N అనుకున్న


N=1250-300 = 950



 జవాబు :  మొత్తం ఓట్లు=1250


 ఓడిన అభ్యర్ది ఓట్లు = 300


 గెలుపొందిన అభ్యర్ది ఓట్లు = 950



కిరణ్ తన నెల ఆదాయంలో10%   నీరు , కరెంట్ బిల్  30%  ఇంటి అద్దె 50% స్కూల్

ఫీజుకు ఖర్చు చేసినా మిగిలిన ఆదాయం 4000   అయిన కిరణ్ నెల ఆదాయం ఎంత ?



రవి ఆదాయం = 100%


10+30+50 = 90%


 మొత్తం ఖర్చు అయిన ఆదాయం (శాతం లో) =90% 


మిగిలిన ఆదాయం = 10% = 4000

 

 శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


 మొత్తం విలువ = x


10% = (4000 / x) * 100


X =  (4000 / 10 ) * 100


X = 40000


కిరణ్ నెల ఆదాయం = X = 40000

Short cut


10% = 4000


100% = ? = x


Cross multiplication


X = (4000*100) / 10 = 40000


కిరణ్ నెల ఆదాయం = X = 40000


X = 40000


పంచదార ధర 25% పెరిగింది. ఖర్చు పెరగకుండా ఉండాలంటే వినియోగాన్ని

ఎంత శాతం తగ్గించుకోవాలి? (20%)


62)ఒక దీర్ఘచతురస్రం పొడవు 20% పెరిగి, వెడల్పు 10% తగ్గితే వైశాల్యంలో మార్పు

ఎంత? (8% పెరుగుతుంది)


63)ఒక ఆదాయంలో 20% ఇంటి అద్దెకు, మిగిలిన దానిలో 30% ఆహారానికి ఖర్చు చేస్తే

, ఇంకా 5,600 మిగిలితే మొత్తం ఆదాయం ఎంత? (10,000)


64)ఒక సంఖ్యలో 75% కి 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఎంత? (300)


65)రవి తన జీతంలో 10% పొదుపు చేస్తాడు. అతని ఖర్చు 9,000 అయితే జీతం

ఎంత? (10,000)


మిగిలిన ప్రశ్నల సమాధానాలు (క్లుప్తంగా):


20% ఆఫ్ 50 + 50% ఆఫ్ 20 = 20

ఒక సంఖ్యను 10% తగ్గించి మళ్ళీ 10% పెంచితే మార్పు = 1% తగ్గుదల


1 కిలోమీటర్ లో 200 మీటర్లు ఎంత శాతం? = 20%


ఒక గంటలో 15 నిమిషాలు ఎంత శాతం? = 25%


ఒక విద్యార్థికి 80% మార్కులు వచ్చాయి. మొత్తం మార్కులు 500 అయితే అతనికి

వచ్చిన మార్కులుఎంత ఎంత శాతం? ( 80%) 

A వయస్సు B వయస్సులో 80% అయితే B వయస్సు A లో ఎంత శాతం? = 125%


ఒక జనాభా ప్రతి ఏటా 10% పెరుగుతుంది. ప్రస్తుతం 1000 ఉంటే 2 ఏళ్ల తర్వాత = 1210


0.01 అనేది 0.1 లో ఎంత శాతం? = 10%


ఒక వ్యక్తి తన జీతంలో 40% ఆహారానికి, 20% అద్దెకు ఖర్చు చేస్తాడు. మిగిలిన 4000

రూపాయలను పొదుపు చేస్తే, అతని మొత్తం జీతం ఎంత? (సమాధానం: 10,000)


A వయస్సు B వయస్సులో 80% కి సమానం. B వయస్సు 25 ఏళ్లు అయితే, A వయస్సు

ఎంత? (20 ఏళ్లు)


ఒక సంఖ్యలో 15% కి 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఎంత?

85% = 75 100 = ?

(75/85) *100 = 88.22


ఒక గ్రామంలో పురుషుల సంఖ్య 60%. స్త్రీల సంఖ్య 800 అయితే, ఆ గ్రామం మొత్తం

జనాభా ఎంత? (2000)


ఒక పరీక్షలో గరిష్ట మార్కులు 500. ఒక విద్యార్థికి 90% మార్కులు వస్తే, అతనికి వచ్చిన

మార్కులు ఎన్ని? (450)


ఒక వస్తువు ధర 200 రూపాయలు. అది మొదట 10% పెరిగి, తర్వాత 10% తగ్గింది. ఇప్పుడు

దాని ధర ఎంత? (198)


A జీతం B కంటే 50% ఎక్కువ. అయితే B జీతం A కంటే ఎంత శాతం తక్కువ? (33.33%)


2 గంటలు అనేది ఒక రోజులో ఎంత శాతం? (8.33%)

ఒక స్కూలులో 1000 మంది విద్యార్థులు ఉన్నారు. 


అందులో 45% బాలికలు అయితే, బాలుర సంఖ్య ఎంత? (550)


ఒక సంఖ్యలో 25% విలువ 50 అయితే, ఆ సంఖ్యలో 75% విలువ ఎంత? (150)


ఒక మిశ్రమంలో 30% చక్కెర ఉంది. 20 కిలోల మిశ్రమంలో చక్కెర పరిమాణం

ఎంత? (6 కిలోలు)


A వయస్సు 30 ఏళ్లు. B వయస్సు A లో 120% అయితే, B వయస్సు ఎంత? (36 ఏళ్లు)


ఒక ఎన్నికలో 8% మంది ఓటు వేయలేదు. వేసిన ఓట్లలో గెలిచిన వ్యక్తికి 54% వచ్చాయి.

అతను 1600 ఓట్ల మెజారిటీతో గెలిస్తే మొత్తం ఓటర్లు ఎంత? (20,000)


500 లో 40% మరియు 200 లో 50% ల మధ్య తేడా ఎంత? (100)


ఒక సంఖ్యను 20% తగ్గించినప్పుడు 160 వచ్చింది. ఆ సంఖ్యను 20% పెంచితే ఎంత

వస్తుంది? (240)


1/5 వంతు అనేది ఎంత శాతానికి సమానం? (20%)

ఒక వస్తువును 120 రూపాయలకు కొని 150 కి అమ్మితే లాభం శాతం ఎంత? (25%)


తండ్రి వయస్సు 50 ఏళ్లు. కొడుకు వయస్సు తండ్రి వయస్సులో 30% అయితే, కొడుకు

వయస్సు ఎంత? (15 ఏళ్లు)


ఒక సంఖ్యలో 10% విలువ 0.5 అయితే, ఆ అసలు సంఖ్య ఎంత? (5)


80 లో ఎంత శాతం 60 అవుతుంది? (75%)


ఒక పట్టణ జనాభా 5000 నుండి 6000 కి పెరిగింది. పెరుగుదల శాతం ఎంత? (20%)


శశి వయస్సు 25 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత అక్షిత వయస్సు శశి వయస్సులో 1/3 వంతు అయితే,

అక్షిత ప్రస్తుత వయస్సు ఎంత? (5 ఏళ్లు)



1)100లో 10% ఎంత? (సమాధానం: 10)


2)500లో 25% ఎంత? (125)


3)ఒక సంఖ్యలో 50% విలువ 40 అయితే, ఆ సంఖ్య ఎంత? (80)


4)80లో ఎంత శాతం 20 అవుతుంది? (25%)


5)ఒక వస్తువు ధర 200 రూపాయలు. దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత తగ్గుతుంది? (20)


6)1/4 ని శాతంలోకి మార్చండి. (25%)


7)60% ని భిన్న రూపంలోకి మార్చండి. (3/5)


8)150లో 20% ఎంత? (30)


9)ఒక పరీక్షలో గరిష్ట మార్కులు 600. ఒక విద్యార్థికి 300 మార్కులు వస్తే అతని శాతం

ఎంత? (50%)


10)1000లో 0.5% ఎంత? (5)



ఒక వ్యక్తి జీతం 10,000. అది 20% పెరిగితే కొత్త జీతం ఎంత? (12,000)


11)ఒక ఊరి జనాభా 5,000. అది 10% తగ్గితే మిగిలిన జనాభా ఎంత? (4,500)


12)పెట్రోల్ ధర 80 నుండి 100కి పెరిగితే పెరిగిన శాతం ఎంత? (25%)


13)ఒక వస్తువు ధర 10% పెరిగి, మళ్ళీ 10% తగ్గితే నికర మార్పు ఎంత? (1% తగ్గుతుంది)


14)200లో 30% విలువ, 300లో 20% విలువకు సమానమా? (అవును, రెండూ 60)


15)ఒక సంఖ్యను 25% పెంచితే 125 అయింది. ఆ సంఖ్య ఎంత? (100)


16)ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 60% మంది బాలురు

అయితే బాలికలు ఎంతమంది? (16)


17)ఒక పండు ధర 20% తగ్గింది. ఇప్పుడు దాని ధర 40 రూపాయలు. అసలు ధర

ఎంత? (50)


18)A జీతం B జీతం కంటే 25% ఎక్కువ. అయితే B జీతం A కంటే ఎంత శాతం

తక్కువ? (20%)


19)ఒక పరీక్షలో పాస్ మార్కులు 35%. ఒక విద్యార్థికి 30% మార్కులు వచ్చి 10

మార్కులతో ఫెయిల్ అయితే గరిష్ట మార్కులు ఎంత? (200)


20)ఒక సంఖ్యలో 20% విలువ 60 అయితే, ఆ సంఖ్యలో 50% విలువ ఎంత?

(సమాధానం: 150)

www.teluguaptitude.com

కొత్తది పాతది