Percentage(medium)

  • ఒక తరగతి లో 400 మంది విద్యార్థులు వున్నా అందులో బాలురు
  •  250 అయిన ఆ తరగతి లో బాలికల శాతం ఎంత.?

మొత్తం విద్యార్థులు = 400
బాలురు =250
బాలికలు =400-250=150
బాలికలు =150
శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100
    
కావున   
     శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100   
               
బాలికల శాతం%=(150 /400) × 100         
          
బాలికల శాతం=37.5%
జవాబు =37.5%
ఒక వ్యకి తన వద్ద ఉన్న మొత్తం లో 90% ఖర్చు చేయగా చివరికి ఆ వ్యకి దగ్గర
 200 మిగిలిన అయినా ఆ వ్యకి దగ్గర మొదట ఉన్న సొమ్ము ఎంత.?

శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100
మొదట ఉన్న సొమ్ము ను x అనుకొనిన

 10% = (200 / x ) × 100x

 = 200*100/10x =

 200*10x = 2000 

 జవాబు: 2000

ఒక కుటుంబం ఒక నెల మొత్తం20 కేజీల  గోధుమలను వినియోగించకొనిన 
గోధుమల ధర 15%పెరిగిన న లో గతంలో గోధుమ కోసం చేసిన ఖర్చుతో
ఎన్ని కేజీల గోధుమ లభించును ?


గతంలో ఖర్చు చేసినా విలువ=100  అనుకొని న


15% పెరగడం వల్ల20 కేజీల గోధుమల  కు చేసే ఖర్చు115 అవుతుంది


 గతంలో ఖర్చు చేసినా 100 కు ప్రస్తుతం లభించే గోధుమలు


=(100 /115)*20


=17.39కేజీలు


 గతంలో ఖర్చు చేసినా రూపాయలకు  ప్రస్తుతం లభించే గోధుమలు=

17.39 కేజీలు


జవాబు =17.39కేజీలు


ఒక వృత్తాకారపు మైదానం వైశాల్యంలో  20 %కార్ల పార్కింగ్ కు, 40 శాతం
భవన నిర్మాణానికి ఉపయోగించిన 500 చదరపు మీటర్లు మిగిలి ఉన్న
ఆ వృత్తాకార మైదానం పూర్తి వైశాల్యం ఎంత

నిర్మాణాలకు ఉపయోగించబడ్డ మొత్తం  విస్తీర్ణం = 40+20=60శాతం

 మిగిలిన విస్తీర్ణం(శాఖలలో)=40 %

40%=500 చదరపు మీటర్లు

శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100

40%=(500/x)*100

x=(500/40)*100

x=500*100/40

x=1250

మైదానం మొత్తం వైశాల్యం=1250 చదరపు మీటర్లు

జవాబు =1250 చదరపు మీటర్లు

ఒక సంవత్సరంలో 73 రోజులు  ఎంత శాతం?


ఒక సంవత్సరం మొత్తం365 రోజులు కలవు


365 రోజులలో 73 రోజుల శాతం


 శాతం=73/ 365*100


శాతం=20%


 ఒక దీర్ఘచతురస్రాకార వస్తువు  పొడవును10% పెంచి వెడల్పును10%

తగ్గించిన వైశాల్యంలో మార్పుశాతం ను కనుగొనుము?


మొదట  పొడవు= 100 


వెడల్పు=100


10% పెంచిన తర్వాత   పొడవు=100+10= 110


10% తగ్గించిన తర్వాత వెడల్పు=100-10=90


దీర్ఘ చతురస్రం వైశాల్యం=పొడవు* వెడల్పు=l*b 


మొదట వైశాల్యం=100*100=10000


 పొడవు,  వెడల్పులో మార్పు తర్వాత  వైశాల్యం=110 *90=9900


ప్రస్తుత వైశాల్యం శాతం లో=9900/100 00)*100=99%


  వైశాల్యం లో వచ్చే మార్పు శాతం= 100-99=1%


జవాబు=1% 


పెట్రోల్ ధర 2  సంవత్సరాల కాలంలో 70 నుండి 90  రూపాయలకు

పెరిగిన ధర పెరుగుదల ఎంత శాతం?


  ధర వ్యత్యాసం= ప్రస్తుత ధర- గత ధర


=90-70 =20


=(20/90)*100


=22.2%


జవాబు=22.2%

ఒక టన్ను లో నాలుగు క్వింటాలు  ఎంత శాతం?


1  టన్ను=10 కింటాలు


 శాతం%=(4/10)*100=40 %


జవాబు=40% 

ఒక కాలేజీలో మొత్తం 420 మంది విద్యార్థులు కలరు అయితే అందులో

70% హాజరు నమోదు అయినా కాలేజీలగల మొత్తం విద్యార్థుల సంఖ్య

ఎంత?


70=x/420*100


x=70*420/100=294


x=294


 హాజరైన విద్యార్థులు=294


 జవాబు=294 

ఒక సంఖ్యలో30%  విలువ 700 అయినా ఆ సంఖ్య 120 % విలువ ఎంత ?


30%  = 70

 100 = ? = xశాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


30% =( 700 / x) *100


x = ( 700 / 30) *100


x=2333.33


100 =2333.33


120% = ? = y


 శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


120 = ( y / 2333.3) * 100


Y = (2333 *120) / 100


Y =2800


ఆ సంఖ్య = 2800


Short cut


30% = 700


120% = ?

Cross multiplication


(700*120) / 30 = 2800

ఆ సంఖ్య = 2800


21)ఒక రేడియో ధర 800 రూపాయలు. దానిపై 15% లాభం రావాలంటే

ఎంతకు అమ్మాలి? (920)


22)ఒక తరగతిలో 50 మందిలో 10 మంది గైర్హాజరయ్యారు (Absent).

హాజరైన వారి శాతం ఎంత? (80%)


23)A వయస్సు 20 ఏళ్లు. B వయస్సు A కంటే 25% ఎక్కువ. B

వయస్సు ఎంత? (25 ఏళ్లు)


24)ఒక సంఖ్యను 10% తగ్గించినప్పుడు 90 వచ్చింది. ఆ అసలు సంఖ్య

ఎంత? (100)


25)40 నిమిషాలు అనేది ఒక గంటలో ఎంత శాతం? (66.66%)


26)ఒక వ్యక్తి తన జీతంలో 70% ఖర్చు చేస్తాడు. అతను నెలకు 3000

పొదుపు చేస్తే, అతని జీతం ఎంత? (10,000)


27)ఒక వస్తువు ధర 500 నుండి 400 కి తగ్గింది. తగ్గుదల శాతం ఎంత?

(20%)


28)ఒక పరీక్షలో 300 మార్కులకు 120 వచ్చాయి. మరో పరీక్షలో 400

మార్కులకు 160 వచ్చాయి. ఏ పరీక్షలో శాతం ఎక్కువ?

(రెండూ సమానం - 40%)


29)ఒక సంఖ్యలో 5% విలువ 20 అయితే, ఆ సంఖ్యలో 100% విలువ

ఎంత? (400)


30)పంచదార ధర 20% పెరిగింది. ఒక కుటుంబం తమ ఖర్చు పెరకుండా

ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? (16.66%)


31)ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులలో ఒకరికి 45% ఓట్లు వచ్చి 200

ఓట్లతో ఓడిపోయాడు. మొత్తం ఓట్లు ఎన్ని? (2000)


32)A ఆదాయం B కంటే 20% తక్కువ. అయితే B ఆదాయం A కంటే

ఎంత శాతం ఎక్కువ? (25%)


33)ఒక దీర్ఘచతురస్రం పొడవు 10% పెరిగింది. వైశాల్యం మారకూడదంటే

వెడల్పు ఎంత శాతం తగ్గాలి? (9.09%)


34)ఒక పట్టణ జనాభా 10,000. మొదటి ఏడాది 10% పెరిగి, రెండో ఏడాది

10% తగ్గితే,రెండు ఏళ్ల తర్వాత జనాభా ఎంత? (9,900)


35)12.5% ని భిన్న రూపంలో రాయండి. (1/8)ఒక బుట్టలో

400 మామిడి పండ్లు ఉన్నాయి. అందులో 15% పాడైపోయాయి.

మంచి పండ్లు ఎన్ని? (340)


36)ఒక విద్యార్థి 25% మార్కులు సాధించి 30 మార్కులతో ఫెయిల్

అయ్యాడు. పాస్ మార్కులు 35% అయితే గరిష్ట మార్కులు ఎన్ని?

(300)


37)ఒక సంఖ్యలో 40% మరియు 30% ల మధ్య వ్యత్యాసం 50 అయితే,

ఆ సంఖ్య ఎంత? (500)


38)25% ఆఫ్ 25% విలువ ఎంత? (0.0625 లేదా 6.25%)

ఒక వస్తువును 10% నష్టంతో 180 కి అమ్మారు. దాని అసలు ధర ఎంత?

(200)


39)ఒక గ్రామంలో 60% మంది అక్షరాస్యులు. నిరక్షరాస్యుల సంఖ్య 800

అయితే మొత్తం జనాభా ఎంత? (2000)


40)A వయస్సు 40. B వయస్సు A లో 80%. 5 ఏళ్ల తర్వాత B వయస్సు

ఎంత? (37 ఏళ్లు)


41)ఒక సంఖ్యను 20% పెంచి, మళ్ళీ 20% పెంచితే నికర పెరుగుదల

ఎంత? (44%)


42)50 కిలోలలో 250 గ్రాములు ఎంత శాతం? (0.5%)


43)ఒక సంఖ్యలో 60% విలువ 120 అయితే, ఆ సంఖ్యలో 1/4 వంతు

ఎంత? (50)


44)రవి జీతం మొదట 25% పెరిగి, తర్వాత 25% తగ్గింది. రవికి లాభమా

లేక నష్టమా? (6.25% నష్టం)


45)ఒక తరగతిలో బాలబాలికల నిష్పత్తి 3:2. ఎంత శాతం మంది

బాలికలు ఉన్నారు? (40%)


46)ఒక గంటలో 1% విలువ ఎన్ని సెకన్లు? (36 సెకన్లు)


ఒక మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది. 5 లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్

పరిమాణం ఎంత? (1 లీటరు)


80 లో 120 ఎంత శాతం? (150%)


47)ఒక సంఖ్యకు దానిలో 15% కలిపితే 115 అవుతుంది. ఆ సంఖ్య

ఎంత? (100)


48)పెట్రోల్ ధర 100 నుండి 110 కి పెరిగితే పెరుగుదల శాతం

ఎంత? (10%)


49)ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% అద్దెకు, 40% ఆహారానికి ఖర్చు

చేస్తాడు. మిగిలిన 4000 పొదుపు చేస్తే ఆదాయం ఎంత? (10,000)


50)0.05 ని శాతంలో రాయండి. (5%)


51)ఒక సంఖ్యలో 70% నుండి 70 తీసివేస్తే 70 వస్తుంది. ఆ సంఖ్య

ఎంత? (200)


52)A బియ్యం ధర B కంటే 25% తక్కువ. B ధర A కంటే ఎంత శాతం

ఎక్కువ? (33.33%)


53)ఒక బ్యాట్స్ మెన్ 110 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 8

సిక్సర్లు ఉన్నాయి. వికెట్ల మధ్య పరిగెత్తి తీసిన పరుగుల శాతం

ఎంత? (45.45%)


54)500 లో 10% లో 20% ఎంత? (10)


55)ఒక పండ్ల వ్యాపారి వద్ద కొన్ని యాపిల్స్ ఉన్నాయి. అతను 40%

యాపిల్స్ అమ్మగాఇంకా 420 మిగిలాయి. మొదట అతని వద్ద

ఉన్నవి ఎన్ని? (700)



56)ఒక సంఖ్యలో 20% కి 20 కలిపితే అదే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య

ఎంత? (25)


57)ఒక ఎన్నికలో గెలిచిన వ్యక్తికి 60% ఓట్లు వచ్చాయి. అతను 200

ఓట్ల మెజారిటీతో గెలిస్తే మొత్తం ఓట్లు ఎన్ని? (1000)


58)ఒక పండులో 80% నీరు ఉంటుంది. ఎండిన తర్వాత అందులో 20%

నీరు ఉంటే, 100 కిలోల తాజా పండ్ల నుండి ఎన్ని కిలోల ఎండిన పండ్లు

వస్తాయి? (25 కిలోలు)


59)ఒక పరీక్షలో 40% మంది గణితంలో, 30% మంది ఇంగ్లీష్ లో ఫెయిల్

అయ్యారు. 10% మంది రెండింటిలో ఫెయిల్ అయితే ఎంత శాతం మంది

పాస్ అయ్యారు? (40%)


60)ఒక వస్తువు ధర 20% తగ్గడం వల్ల ఒక వ్యక్తి 100 రూపాయలకు

5 కిలోలు అదనంగా కొనగలిగాడు. తగ్గించిన ధర ఎంత? (4 రూపాయలు)

www.teluguaptitude.com

కొత్తది పాతది