భాగస్వాములు (medium)

ఇద్దరు భాగస్వాములు 2000,4000 చొప్పున పెట్టుబడులతో ఒక వ్యాపారాన్నిప్రారంభించారు
.సంవత్సరం చివర ఆ వ్యాపారులు ఇద్దరు వచ్చిన లాభాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తుల ఆధారంగా పంచుకోగా మొదటి వ్యాపారికి 500 లాభం వచ్చిన మొత్తం లాభం ఎంత? 


భాగస్వాముల పెట్టుబడుల నిష్పత్తి =2000:4000 =1:2

 నిష్పత్తి ప్రకారం పెట్టుబడి 3భాగాలు గా  (2+1) విభాగించబడింది

మొదటివ్యక్తి కి ఒక భాగం విలువ =500

మొత్తం లాభం=ఒక భాగం విలువ × మొత్తం భాగాలు

∴ మొత్తం లాభం = 500 × 3=1500

 మొత్తం లాభం =1500

జవాబు = 1500

ఒక వ్యాపారానికి లక్కణ్, రాజు, 2:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినా అందులో రాజు .25000పెట్టుబడి పెట్టిన లక్ష్మన్ ఎంతపెట్టుబడి పెట్టాడు?


లక్ష్మణ్ నిష్పత్తి =  2

రాజునిష్పత్తి  = 5

5 —--20,000

2 —---?

Cross multification

20000*2 / 5 = 8000

లక్ష్మన్ పెట్టిన పెట్టుబడి = 8000 రూపాయలు 


క్రిష్ణ, రవి ఒక వ్యాపారాన్ని కొంత పెట్టుబడులతో మొదలు పెట్టారు. అందులో 40% వాటా కలిగిన

క్రిష్ణ పెట్టుబడి 250000 రూపాయలు అయిన రవి పెట్టుబడి ఎంత?


క్రిష్ణ పెట్టు బడి = 25,000

40% = 25,000

60% = ?

( 25000 / 40) * 60

6250 * 6 = 37500

రవి పెట్టుబడి =37500


అక్షిత, ప్రహర్షిత ఒక వ్యాపారాన్ని ,40%, 60%  పెట్టుబడులతో  మొదలు పెట్టారు. అందులో 20% శాతం నుఅక్షిత విరమించుకోగా మిగిలిన అక్షిత వాటా ఎంత ?

మొత్తం పెట్టుబడి 100 రూపాయలు అనుకుందాం.

అందులో 20 ను అక్షిత విరమించుకోగా మిగిలిన మొత్తం పెట్టుబడి = 100 -20 = 80రూపాయలు.

మొత్తం పెట్టుబడి = 80రూపాయలు

80 = 100%

20 = ఎంత శాతం ?

CROSS MULTIFICATION

శాతం% = (100 / 80 ) * 100 = 25 %


రాజు, రమేష్ 23 నిమిత్తిలో 5,00,000 రూపాయల వ్యాపారాన్ని ప్రారంభించారు. 6నెలలతర్వాత రాజు తన వ్యాపారం నుంచి వైదొలగగా సంవత్సరం చివర 2,00,000 లాభం వచ్చిన అందులో రాజు వాట ఎంత?


రాజు వాట = పెట్టుబడి నిష్పత్తి * కాలం నిష్పత్తి


రాజు: రమేష్ = 2*6 : 3*12 = 1 : 3


వారి పెట్టుబడి, కాలాల నివృత్తి  = 1:3


రాజు వాట =( 200000/ 4) * 1 = 50,000


రాజు వాట.50,000 రూపాయలు



A, B మరియు C లు వరుసగా ₹12,000, ₹15,000 మరియు ₹18,000 లతో వ్యాపారం ప్రారంభించారు. వారి లాభాల నిష్పత్తి ఎంత?

ఒక వ్యాపారంలో A పెట్టుబడి ₹4,000. 6 నెలల తర్వాత B కొంత సొమ్ముతో చేరాడు. ఏడాది చివరన లాభాలను 2:1 నిష్పత్తిలో పంచుకుంటే B పెట్టిన పెట్టుబడి ఎంత?

X, Y లు 5:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఏడాది చివరన వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 5:4 అయితే, వారు పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి ఎంత?

A యొక్క పెట్టుబడిలో 3 రెట్లు, B యొక్క పెట్టుబడిలో 4 రెట్లకు సమానం. అయితే వారి లాభాల నిష్పత్తి ఎంత?

ముగ్గురు భాగస్థులు 5:7:8 నిష్పత్తిలో లాభాలను పొందారు. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు మరియు 7 నెలల పాటు వ్యాపారంలో ఉంటే, వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత?

విభాగం 6: పెట్టుబడి ఉపసంహరణ/కలపడం (Additions & Withdrawals)

A ₹20,000 తో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత ₹5,000 అదనంగా చేర్చాడు. B ₹30,000 తో ప్రారంభించి 6 నెలల తర్వాత ₹10,000 వెనక్కి తీసుకున్నాడు. ఏడాది చివరన లాభాల నిష్పత్తి ఎంత?

కిరణ్ మరియు చరణ్ 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 3 నెలల తర్వాత కిరణ్ తన పెట్టుబడిలో 1/4 వంతు, చరణ్ తన పెట్టుబడిలో 1/5 వంతు వెనక్కి తీసుకున్నారు. 10 నెలల తర్వాత వచ్చిన ₹1,520 లాభంలో కిరణ్ వాటా ఎంత?

A, B లు ₹16,000 మరియు ₹12,000 తో వ్యాపారం ప్రారంభించారు. 3 నెలల తర్వాత A ₹5,000 వెనక్కి తీసుకున్నాడు, అదే సమయంలో B ₹5,000 అదనంగా చేర్చాడు. మరో 3 నెలల తర్వాత C ₹21,000 తో చేరాడు. ఏడాది చివరన ₹26,400 లాభం వస్తే B వాటా ఎంత?

విభాగం 7: వర్కింగ్ పార్ట్నర్ మరియు మేనేజ్మెంట్ ఫీజు (Working Partner & Salary)

A, B లు ₹50,000 మరియు ₹40,000 తో వ్యాపారం ప్రారంభించారు. A వర్కింగ్ పార్ట్నర్ కావడం వల్ల లాభంలో 20% జీతంగా తీసుకుంటాడు. మిగిలిన లాభాన్ని పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటే, మొత్తం ₹18,000 లాభంలో A కి వచ్చే మొత్తం వాటా ఎంత?

ఒక వ్యాపారంలో మొత్తం లాభం ₹2,500. అందులో 5% ధార్మిక సంస్థలకు విరాళంగా ఇచ్చారు. మిగిలిన లాభాన్ని A, B లు 3:2 నిష్పత్తిలో పంచుకుంటే A వాటా ఎంత?

A, B, C లు భాగస్థులు. A మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు, B మొత్తం పెట్టుబడిలో 1/4 వంతు పెట్టారు. మిగిలిన పెట్టుబడి C పెట్టాడు. ₹4,800 లాభంలో C వాటా ఎంత?


www.teluguaptitude.com

కొత్తది పాతది