partnership (hard )

ముగ్గురు వ్యక్తులు A,B,C లు 8000,4000,2000 రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ఆరంభించారు ఐతే సంవత్సరం చివర మొత్తం 10,000 లాభం అందుకున్న A  లాభం యెంత?
 A,B,C  పెట్టుబడుల నిష్పత్తులు =8000:4000:2000 =4:2:1

నిష్పత్తులను అనుసరించి మొత్తం భాగాలు =7

A యెక్క లాభం =(1000/7) × 4

=1428.57× 4

A యెక్క లాభం =5714. 2

జవాబు  =5714. 2

లిఖిత్ మరియు వేదాన్స్ కలిసి తమ వ్యాపారాలను 3:5నిష్పత్తుల లో లిఖిత్  పెట్టుబడి పెట్టిన 3 నెలల తర్వాత వేదాన్స్ పెట్టుబడి పెట్టిన లిఖిత్ మరియు వేదాన్స్  లకు సంవత్సరం తర్వాత 90000 లాభం వచ్చిన  లాభం లో వేదాన్స్ వాటా  ఎంత ? 

పెట్టుబడుల నిష్పత్తి = 3:5

 

కాలం నిష్పత్తి  = 12:9 = 4:3


లాభాల నిష్పత్తి = (4*3) : (5*3) = 12 : 15


నిష్పత్తి మొత్తం  = 12 + 15 = 27 


మొత్తం లాభం = 90000


లాభం లో వేదాన్స్ వాటా = (90000 / 27) * 15


లాభం లో వేదాన్స్ వాటా = 50,000


జవాబు  = 50,000


కిరణ్ మరియు రమేష్ ఒక వ్యాపారాన్ని50,000 , 40,000 రూపాయలుపెట్టుబడులతో

మొదలు పెట్టిన సంవత్సరం తర్వాత వ్యాపారంలో 50,000లు లాభం వచ్చిన  అందులోకిరణ్ వాటా ఎంత?

పెట్టుబడుల నిష్పత్తి = 50000/40000 = 5:4

పెట్టుబడుల నిష్పత్తి = 5:4

లాభం వాటా = ( మొత్తం లాభం / నిష్పత్తి మొత్తం ) * ఆవ్యక్తి నిష్పత్తి

మొత్తం లాభం = 50,000

నిష్పత్తి మొత్తం = 5 + 4 = 9

ఆవ్యక్తి (కిరణ్) నిష్పత్తి = 5

 లాభం వాటా = (50000 / 9) * 5 = 250000 / 9 

250000 / 9 = 27777

కిరణ్ వాటా = 27777 రూపాయలు`


రవి 15,000లలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు 3 నెలల తరువాత కిషోర్ 20,000లతోవ్యాపారంలో చేరిన సంవత్సరం చివరణ 5,000 రూపాయలు లాభం వచ్చిన అందులో కిశోర్ వాటా ఎంత ? ( కాలం ఇవ్వనప్పుడు సంవత్సరాన్ని కాలంగా తీసుకుంటారు )

వాటాల నిష్పత్తి = 15000:20000 = 3:4

కాలాల  నిష్పత్తి  = 12 : 9 = 4:3

నిష్పత్తి = 3*4 : 4* 3 = 1 : 1

నిష్పత్తి :మొత్తం = 1+1 = 2

(5000/ 2) * 1 = 2500

లాభం లో కిశోర్ వాటా = 2500

:

కిషోర్ 40,000లతో వ్యాపారాన్ని ప్రారంభించిన కొంత కాలం తరువాత 72000 ల తో సతీష్ వ్యాపారంలోన చేరెను అయిన సంవత్సరం తరువాత వారు 3:2 నిష్పత్తితో వాటాలని పంచిన వ్యాపారంప్రారంభించిన ఎంత కాలానికి వ్యాపారంలో చెరెను?

పెట్టుబడుల నిష్పత్తి =40000 : 72000 = 5:9

కాలాల నిష్పత్తి : 12 : x

12 * 5: 9x =: 3:2

60/9x =  3:2

9x = 60 * 2/3

9x =.40

X = 40/9 = 4.4

అతను పెట్టుబడులు పెట్టిన కాలం 4 నెలల 12 రోజులు.


0.4 ను రోజులలోకి మార్చడం,

1 = 30 రోజులు.

0.4 = ఎంత?

(30/1) *0.4 =30 * 0.4 = 12 రోజులు.

సతీష్ పెట్టుబడి పెట్టిన సమయం = 4 నెలల  12 రోజులు,


కిరణ్, రవిలు 5,00,000ల పెట్టు బడితో 2:3 నిష్పత్తి లో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 6నెలల తర్వాత కిరణ్ తన పెట్టుబడికి 2 రెట్లు ఎక్కువ పెట్టుబడి  పెట్టిన సంవత్సరం తర్వాత 300,000లక్షలు లాభంవచ్చిన అందులో కిరణ్ వాట ఎంత?


{ ఇటువంటి ప్రశ్నలను భాగా గమనించండి లేదంటే మోసపోతారు}

కిరణ్ పెట్టుబడి. =( 5,00,000 / 5)  * 2 = 1,00,000

కిరణ్పెట్టుబడి =  1,00,000

6 నెలల తర్వాత కిరణ్ ఎక్కువ పెట్టినపెట్టుబడి.= 2,00,000

6 నెలల తర్వాత కిరణ్ మొత్తం పెట్టుబడి.= 2,00,000 + 1,00,000 =

3,00,000


రవి పెట్టుబడి = 5,00,000 - 1,00,000  = 4,00,000

వారి పెట్టుబడి, కాలాల నివృత్తి  = (1,00,000 *6+ 3,00,000 * 6) :

(4,00,000 x 12)

 =6 (1,00,000 + 3,00,000) :( 4,00,000*12)

= ( 4,00,000*6):( 4,00,000*12)

= 1:2

పెట్టుబడి, కాలల నిష్పత్తి = 1:2

లాభంలో కిరణ్ వాట = (3,00,000 / 3) * 1 = 1,00,000

లాభంలో కిరణ్ వాట = 1,00,000  రూపాయలు


ఇద్దరు వ్యక్తులు సమానంగా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం లో వారి లాభం 2లక్షలు మరియు వారి లాభం వారి పెట్టుబడిలో ⅔ వవంతు అయిన వారు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత?అందులో ఒక్కొక్కరి పెట్టుబడి ఎంత?


వారి పెట్టుబడి = X అనుకొనుము 

⅔ X = 2,00,000

X = 2,00,000 * 3/2 

X = 100000 * 3 =3,00,000

ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000

ఒక్కొక్కరి పెట్టుబడి = 3,00,000 /2 = 1,50,000 రూపాయలు


ముగ్గురు భాగస్వాములు A ,B, C లు ఒక వ్యాపారాన్ని A పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి B, B పెట్టుబడికి 2 రెట్లు పెట్టుబడి C పెట్టినా అందులో లాభం గా A  5,000 రూపాయలను తీసుకున్నాడు. ఇది మొత్తం పెట్టుబడి లో 5% పెట్టుబడి అయిన మొత్తం పెట్టుబడి ఎంత? అందులో B వాట ఎంత?


పెట్టుబడి లో  5 % = 5000

మొత్తం పెట్టుబడి 100% = ?

(5000/5) * 100 = 1000 * 100 = 1,00,000

మొత్తం పెట్టుబడి 100% =1,00,000/


అందులో

 A  వాట = X  

 B వాట = 2X

 C వాట = 3X

X : 2X : 3X = 1:2:4 

నిష్పత్తుల మొత్తం = 1+2+4 = 7

 B వాట = 2X = ( 1,00,000 / 7 ) * 2

B పెట్టుబడి  = 14285.7 * 2

B పెట్టుబడి  = 28571 .4


సోము, రాములు కలిసి ఒక వ్యాపారాన్ని 2,00,000 రూపాయలతో ప్రారంభించి అందులో 20% వాటాను సోము అదనంగా చేర్చడం వల్ల  సోము వాటా 50% అయింది అయిన రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టుబడి ఎంత?

రాము వాటా ,సోము వాటా

 6 నెలల తర్వాత సోము వ్యాపారంలో చేర్చిన వాట =  20%

100% = 2,00,000

20 % = ?

(2,00,000 / 100) * 20 = 40,000

2 0

40,000/

40,000 అదనంగా సోము చేర్చడం వల్ల తన వాట 50%  అయిుంది.


రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. 2,40,000 / 2 = 120,000


రాము వ్యాపారం మొదట్లో పెట్టిన పెట్టు ఒడి. = 120,000


రాజు, కిరణ్, రవిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని 40% , 60% పెట్టుబడులతో మొదలు పెట్టారు.అందులో  30% వాటా కలిగిన రాజు 50,000 పెట్టుబడిగా అయిన మొత్తం పెట్టుబడి ఎంత?


రాజువాట 30% = 50,000

100% = ?

( 50,000 / X ) * 100 = 30%

X =( 50,000 / 30 ) * 100 

మొత్తం పెట్టుబడి:1,66,666 రూపాయలు.



₹20,000 తో ప్రారంభించి, 6 నెలల తర్వాత మరో ₹5,000 కలిపాడు.

ఏడాది చివరన అతని మొత్తం పెట్టుబడి యూనిట్లు ఎంత?


ఒక వ్యాపారంలో A, B లు ₹50,000 చొప్పున పెట్టారు. 4 నెలల తర్వాత

A ₹10,000 వెనక్కి తీసుకున్నాడు. ఏడాది చివరన లాభాల నిష్పత్తి ఎంత?


X ₹40,000 తో ప్రారంభించాడు. ప్రతి 4 నెలలకు ₹10,000 అదనంగా

చేరుస్తూ ఉంటే ఏడాది చివరన అతని వాటా ఎంత?


A, B లు 3:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 10 నెలల తర్వాత B

తప్పుకున్నాడు. ఏడాది చివరన లాభం ₹7,000 అయితే B వాటా ఎంత?


రామ్ ₹12,000 తో ప్రారంభించాడు. 6 నెలల తర్వాత లక్ష్మణ్ ₹15,000

తో చేరాడు. మరో 3 నెలల తర్వాత రామ్ మరో ₹3,000 కలిపాడు.

ఏడాది చివరన నిష్పత్తి ఎంత?


లు


A వర్కింగ్ పార్ట్నర్. మొత్తం లాభం ₹5,000 లో A కి 10% కమిషన్ ఇచ్చాక

మిగిలినది 2:3 నిష్పత్తిలో పంచితే B వాటా ఎంత?


మొత్తం పెట్టుబడి ₹50,000. A వాటా B కంటే ₹4,000 ఎక్కువ. మొత్తం

లాభం ₹10,000 లో A వాటా ఎంత?


ఒక మైదానాన్ని A, B, C లు అద్దెకు తీసుకున్నారు. A 10 ఆవులను 3

వారాలు, B 15 ఆవులను 2 వారాలు మేపితే వారి అద్దె నిష్పత్తి ఎంత?


A మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు పెట్టాడు. B మిగిలిన దాంట్లో సగం

పెట్టాడు. లాభం ₹9,000 లో C వాటా ఎంత?


5% లాభం చారిటీకి ఇచ్చాక, మిగిలిన లాభంలో A వాటా ₹855

(నిష్పత్తి 3:2 ప్రకారం) అయితే మొత్తం లాభం ఎంత?



ఒక వ్యాపారంలో A పెట్టుబడి ₹10,000. 4 నెలల తర్వాత B కొంత పెట్టు

బడి

తో చేరాడు. ఏడాది చివరన మొత్తం లాభం ₹8,000 కాగా, అందులో B

వాటా

₹3,000 అయితే, B పెట్టిన పెట్టుబడి ఎంత?


A, B మరియు C లు 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఏడాది చివరన

లాభాల నిష్పత్తి 5:3:12 అయితే, వారు పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి

ఎంత?


A మొత్తం పెట్టుబడిలో 1/4 వంతును \frac{1}{4} కాలానికి, B

మొత్తం పెట్టుబడిలో 1/5 వంతును 1/2 కాలానికి మరియు C మిగిలిన

పెట్టుబడిని పూర్తి కాలానికి పెట్టారు. ₹7,140 లాభంలో A వాటా ఎంత?


ఒక వ్యాపారంలో A మరియు B లు భాగస్థులు. A పెట్టిన పెట్టుబడి, B

పెట్టుబడికి 3 రెట్లు మరియు A పెట్టిన కాలం, B పెట్టిన కాలానికి రెట్టింపు.

B కి ₹4,000 లాభం వస్తే మొత్తం లాభం ఎంత?


A, B, C లు ₹20,000, ₹25,000 మరియు ₹30,000 లతో వ్యాపారం

మొదలుపెట్టారు. A వర్కింగ్ పార్ట్నర్ కావడంతో లాభంలో 20% జీతంగా

తీసుకుంటాడు. మిగిలిన లాభాన్ని పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటే,

ఏడాది చివరన మొత్తం ₹15,000 లాభం వస్తే A కి వచ్చే మొత్తం వాటా

ఎంత?


మొత్తం పెట్టుబడి ₹47,000 లో, A వాటా B కంటే ₹7,000 ఎక్కువ, B

వాటా C కంటే ₹5,000 ఎక్కువ. ₹9,400 మొత్తం లాభంలో B వాటా ఎంత?


A, B లు ₹50,000 మరియు ₹40,000 లతో వ్యాపారం ప్రారంభించారు.

4 నెలల తర్వాత A తన పెట్టుబడిలో సగం తీసేసుకున్నాడు, అదే

సమయంలో B తన పెట్టుబడిని రెట్టింపు చేశాడు. ఏడాది చివరన లాభాల

నిష్పత్తి ఎంత?


X మరియు Y లు ఒక గడ్డి మైదానాన్ని ₹1,000 కి అద్దెకు తీసుకున్నారు.

X తన 100 ఆవులను 8 నెలల పాటు మేపాడు. మిగిలిన 4 నెలల పాటు

Y ఎన్ని ఆవులను మేపితే, అతను ₹600 అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది?


A, B లు 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 3 నెలల తర్వాత A తన పెట్టు

బడి

లో {1/4} వంతు, B తన పెట్టుబడిలో {1/5} వంతు వెనక్కి తీసుకున్నారు.

10 నెలల తర్వాత వచ్చిన ₹7,600 లాభంలో A వాటా ఎంత?


ఒక వ్యాపారంలో వచ్చిన లాభం నుండి 5% భవిష్యత్తు అవసరాల కోసం

పక్కన పెట్టి, మిగిలిన లాభాన్ని A, B లు 3:2 నిష్పత్తిలో పంచుకున్నారు.

A వాటా ₹8,550 అయితే మొత్తం లాభం ఎంత?


A, B, C లు వరుసగా 1/2 : 1/3 : 1/5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 4

నెలల తర్వాత A తన పెట్టుబడిలో సగం ఉపసంహరించుకున్నాడు. 12

నెలల తర్వాత ₹4,150 లాభం వస్తే A వాటా ఎంత?


కిరణ్ ₹40,000 తో ఒక దుకాణం ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం

అతను ₹10,000 అదనంగా పెట్టుబడి పెడుతున్నాడు. 2 ఏళ్ల తర్వాత

అతని స్నేహితుడు సురేష్ ₹80,000 తో చేరాడు. 4 ఏళ్ల చివరన వారి

లాభాల నిష్పత్తి ఎంత?


A మరియు B లు ఒక వ్యాపారంలో భాగస్థులు. A తన పెట్టుబడిని 9

నెలల పాటు ఉంచాడు. వచ్చిన లాభంలో B వాటా 2/5 వంతు మరియు

కాలం 6 నెలలు అయితే, వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత?


ముగ్గురు పాలు అమ్మే వ్యక్తులు ఒక మైదానాన్ని అద్దెకు తీసుకున్నారు

P 24 ఆవులను 3 నెలలు, Q 10 ఆవులను 5 నెలలు, R 35 ఆవులను

4 నెలలు మేపితే, మొత్తం అద్దె ₹2,100 లో Q వాటా ఎంత?


A మరియు B ల పెట్టుబడుల నిష్పత్తి 3:2. లాభంలో 5% ధార్మిక సంస్థకు

ఇస్తే, A కి ₹855 వాటాగా వచ్చింది. B వాటా ఎంత?


A తన పెట్టుబడిలో సగం 6 నెలల పాటు, 1/3 వంతు పెట్టుబడిని 9 నెలల

పాటు మరియు మిగిలిన పెట్టుబడిని ఏడాది మొత్తం ఉంచాడు. లాభాల

నిష్పత్తి ఎలా ఉంటుంది?


₹1,20,000 పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారంలో A, B, C ల వాటాల

నిష్పత్తి 2:3:5. ఏడాది చివరన 15% లాభం వస్తే, C పొందే లాభం ఎంత?


A మరియు B లు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A పెట్టిన పెట్టుబడి

B పెట్టుబడిలో 4/5 వంతు. 10 నెలల తర్వాత B వ్యాపారం వదిలి

వెళ్ళాడు. ఏడాది చివరన లాభాలు సమానంగా ఉంటే A ఎన్ని నెలలు

పెట్టుబడి పెట్టాడు?


P, Q, R లు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నారు. P మొత్తం లాభంలో 2/7

వంతు పొందాడు, మిగిలిన లాభాన్ని Q మరియు R లు సమానంగా

పంచుకున్నారు. P వాటా R వాటా కంటే ₹500 తక్కువ అయితే మొత్తం

లాభం ఎంత?


ఒక వ్యాపారంలో A, B మరియు C లు భాగస్థులు. A పెట్టుబడిలో

రెట్టింపు B పెట్టుబడిలో మూడు రెట్లకు సమానం, మరియు B

పెట్టుబడి పెట్టుబడిలో నాలుగు రెట్లకు సమానం. ₹16,500

లాభంలో B వాటా ఎంత?



A మరియు B లు వరుసగా 5000, 7000 రూపాయలతో వ్యాపారం

ప్రారంభించారు. ఏడాది చివరన 2400 లాభం వస్తే A వాటా ఎంత?


పెట్టుబడుల నిష్పత్తి (A:B): 5000 : 7000 = 5 : 7

లాభాల నిష్పత్తి: కాలం సమానం కాబట్టి, లాభాల నిష్పత్తి కూడా 5 : 7.

మొత్తం వాటాలు: 5 + 7 = 12

A వాటా: [మొత్తం లాభం/12 ] * 5 =

(5/12)*2400= 1000


A వాటా = ₹1000

A వాటా ₹1000



రమ్య, కావ్య 3:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం 16,000

అయితే కావ్య వాటా ఎంత?


లాభాల నిష్పత్తి (రమ్య:కావ్య): 3 : 5 (కాలం సమానం అని భావించ

బడింది)


మొత్తం వాటాలు: 3 + 5 = 8

కావ్య వాటా:( మొత్తం లాభం/8) * 5


కావ్య వాటా = (⅝)*16,000 = 5 *2000 = ₹10,000

కావ్య వాటా ₹10,000


X, Y, Z లు 2:3:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. Z కి 8000 లాభం వస్తే,

మొత్తం లాభం ఎంత?




ఇద్దరు భాగస్థులు సమాన కాలానికి పెట్టుబడి పెట్టినప్పుడు, లాభాలు ఏ

నిష్పత్తిలో పంచబడతాయి?


ఒక వ్యాపారంలో పెట్టుబడుల నిష్పత్తి 5:4 మరియు కాలాల నిష్పత్తి 2:3

అయితే లాభాల నిష్పత్తి ఎంత?


స్థాయి 2: కాలం మారినప్పుడు (Different Time Periods)


A 10,000లతో వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల తర్వాత B 15,000ల

తో చేరాడు. ఏడాది చివరన లాభాల నిష్పత్తి ఎంత?


ప్రసాద్ 20,000లతో ప్రారంభించిన వ్యాపారంలో, 4 నెలల తర్వాత కిరణ్

30,000లతో చేరాడు. ఏడాది చివరన 14,000 లాభం వస్తే కిరణ్ వాటా

ఎంత?


ఒక వ్యాపారంలో A పెట్టుబడి B పెట్టుబడికి రెట్టింపు. B 8 నెలలు, A 6

నెలలు పెట్టుబడి పెడితే వారి లాభాల నిష్పత్తి ఎంత?


సీత 8 నెలల పాటు 5000, గీత 10 నెలల పాటు 4000 పెట్టుబడి పెట్టారు.

వారి లాభాల వాటా సమానమా?


A, B లు 5:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 8 నెలల తర్వాత A తప్పుకు

న్నాడు. ఏడాది చివరన లాభం 5:9 నిష్పత్తిలో ఉంటే B ఎన్ని నెలలు

ఉన్నాడు?


స్థాయి 3: పెట్టుబడి మార్పులు (Changes in Investment)


P 40,000లతో ప్రారంభించి, 6 నెలల తర్వాత మరో 10,000 కలిపాడు.

Q 50,000లతో ఏడాది పాటు ఉంటే లాభాల నిష్పత్తి ఎంత?


A, B లు 3:2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 4 నెలల తర్వాత A తన

పెట్టుబడిలో సగం వెనక్కి తీసుకుంటే ఏడాది చివరన లాభాల నిష్పత్తి

ఎంత?


ముగ్గురు వ్యక్తులు 1/2 : 1/3 : 1/4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం

లాభం 13,000 అయితే మొదటి వ్యక్తి వాటా ఎంత?


స్థాయి 4: వర్కింగ్ పార్ట్నర్ & ఇతరాలు (Working Partners)


వ్యాపారాన్ని చూసుకుంటున్నందుకు A కి లాభంలో 10% జీతంగా

ఇస్తారు. మిగిలిన లాభాన్ని పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటే, మొత్తం

లాభం 10,000 లో A వాటా ఎంత (పెట్టుబడి సమానం అనుకుంటే)?


A తన పెట్టుబడిని 3 రెట్లు చేసి, కాలం సగం చేస్తే లాభంలో మార్పు

ఉంటుందా?



భాగస్వామ్యం (Partnership) - ప్రాక్టీస్ ప్రశ్నలు



A, B మరియు C లు ఒక గడ్డి మైదానాన్ని ₹2,660 కి అద్దెకు తీసుకున్నారు.

A 18 ఆవులను 4 నెలలు, B 16 ఆవులను 6 నెలలు, C 14 ఆవులను 7

నెలలు మేపితే, C చెల్లించాల్సిన అద్దె ఎంత?


ఒక వ్యాపారంలో A పెట్టుబడి కాలం B పెట్టుబడి కాలానికి రెట్టింపు. వారి

పెట్టుబడుల నిష్పత్తి 3:4 అయితే లాభాల నిష్పత్తి ఎంత?


A మరియు B లు 7:9 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 8 నెలల తర్వాత A

తన పెట్టుబడిని వెనక్కి తీసుకున్నాడు. వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 8:9

అయితే B ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు?


మొత్తం పెట్టుబడి ₹60,000 లో A వాటా B కంటే ₹10,000 ఎక్కువ, B

వాటా C కంటే ₹5,000 ఎక్కువ. ₹30,000 మొత్తం లాభంలో A వాటా

ఎంత?


ముఖ్యమైన సూత్రాలు (Key Formulas):

లాభాల నిష్పత్తి = (పెట్టుబడి 1/times కాలం T1) :

(పెట్టుబడి 2 /times కాలం T2)

పెట్టుబడి నిష్పత్తి = (లాభం / కాలం) నిష్పత్తి

కాలాల నిష్పత్తి = (లాభం / పెట్టుబడి) నిష్పత్తి


Ex: ఒక చిన్న సవాల్ (Challenge Question):


"A మొత్తం మూలధనంలో 1/6 వంతును 1/6 కాలానికి, B మొత్తం

మూలధనంలో 1/3 వంతును 1/3 కాలానికి, మరియు C మిగిలిన

మూలధనాన్ని పూర్తి కాలానికి పెట్టుబడిగా పెట్టారు. ₹4,600 లాభంలో

B వాటా ఎంత?”


స్థాయి 1: ప్రాథమిక ప్రశ్నలు (సమాన కాలం ఉన్నప్పుడు)


A, B లు ₹15,000 మరియు ₹25,000 లతో వ్యాపారం ప్రారంభించారు.

వారి లాభాల నిష్పత్తి ఎంత?

X, Y, Z లు 3:4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఏడాది చివరన

₹24,000 లాభం వస్తే Y వాటా ఎంత?


రాము ₹10,000, సోము ₹12,000 పెట్టుబడి పెట్టారు. సోముకి ₹6,000

లాభం వస్తే రాముకి ఎంత వస్తుంది?

ఒక వ్యాపారంలో మొత్తం లాభం ₹10,000. A కి ₹4,000 వస్తే, A

మరియు B ల పెట్టుబడుల నిష్పత్తి ఎంత?


P, Q, R ల పెట్టుబడులు ₹2000, ₹3000, ₹4000. మొత్తం లాభం

₹13,500 లో R వాటా ఎంత?


ఇద్దరు వ్యక్తులు 5:9 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వారి మధ్య లాభాల

వ్యత్యాసం ₹1,200 అయితే మొత్తం లాభం ఎంత?


A పెట్టుబడి ₹5,000, B పెట్టుబడి ₹7,000. B వాటా ₹3,500 అయితే

మొత్తం లాభం ఎంత?


1/4 : 1/5 : 1/6 నిష్పత్తిలో ముగ్గురు పెట్టుబడి పెట్టారు. లాభాల నిష్పత్తిని

సరళ రూపంలో తెలపండి.

A పెట్టుబడి B పెట్టుబడికి 3 రెట్లు. వారి లాభాల నిష్పత్తి ఎంత?


₹45,000 లాభాన్ని 2:3 నిష్పత్తిలో పంచితే పెద్ద వాటా ఎంత?


A ₹10,000 తో ప్రారంభించగా, 6 నెలల తర్వాత B ₹20,000 తో చేరాడు.

ఏడాది చివరన లాభాల నిష్పత్తి ఎంత?


రవి 8 నెలల పాటు ₹5,000, కిరణ్ 4 నెలల పాటు ₹10,000 పెట్టుబడి

పెట్టారు. లాభం ఎలా పంచుకోవాలి?

ఒక వ్యాపారంలో A, B ల పెట్టుబడులు 3:5. A 12 నెలలు, B 6 నెలలు

ఉంటే లాభాల నిష్పత్తి ఎంత?


X ₹12,000 తో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత Y చేరాడు. ఏడాది

చివరన లాభాలు సమానంగా ఉంటే Y పెట్టుబడి ఎంత?


ప్రసాద్ ₹40,000 తో ప్రారంభించిన వ్యాపారంలో 3 నెలల తర్వాత

₹60,000 తో సురేష్ చేరాడు. ఏడాది చివరన ₹26,000 లాభంలో

సురేష్ వాటా ఎంత?


ఒక వ్యాపారంలో A పెట్టుబడి ₹2,000 కాలం 5 నెలలు, B పెట్టుబడి

₹5,000 కాలం 2 నెలలు. వారి లాభాల నిష్పత్తి ఎంత?


P, Q లు 8:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. P 7 నెలలు, Q 8 నెలలు ఉంటే

లాభాల నిష్పత్తి ఎంత?


A 6 నెలల పాటు ₹4,000, B 8 నెలల పాటు ₹3,000, C 4 నెలల పాటు

₹6,000 పెట్టుబడి పెట్టారు. లాభం ₹4,500 లో C వాటా ఎంత?


భాస్కర్ ₹15,000 తో ప్రారంభించి 8 నెలల తర్వాత తప్పుకున్నాడు.

ఏడాది చివరన లాభంలో అతని వాటా ఎంత శాతం?


కాలాల నిష్పత్తి 2:3, లాభాల నిష్పత్తి 4:9 అయితే పెట్టుబడుల నిష్పత్తి

ఎంత?



www.teluguaptitude.com

కొత్తది పాతది